కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామంలో కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి చెందాయి. తెలంగాణలోని పెబ్బేరు సంతలో సుమారు రూ. 4 లక్షల విలువైన ఈ గొర్రెలను పంచాయతీ భవనంలో ఉంచగా, అర్ధరాత్రి దాడి జరిగింది. దీంతో గొర్రెల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కమిటీ తెలిపింది. మృతి చెందిన ప్రతి గొర్రెకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.