కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 18న నిర్వహించిన రాత పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి బుధవారం తెలిపారు. ఈ పరీక్షలను త్వరలో మళ్లీ నిర్వహిస్తామని, ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.