కర్నూలు: మచిలీపట్నం రైలు పునరుద్ధరణకు సిపిఎం డిమాండ్

447చూసినవారు
కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పోస్ట్ ఆఫీస్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం గురువారం నిర్వహించారు. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడం వల్ల వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజుకు వేల మంది విజయవాడకు వెళ్లాల్సి వస్తోందని నగర కార్యదర్శి సాయిబాబా తెలిపారు. ఈ సమస్యలను రైల్వే మంత్రి, రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టు కార్డులు పంపారు. మచిలీపట్నం రైలు పునరుద్ధరణకు కూడా సీపీఎం డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్