కర్నూలు నగరంలో మంగళవారం, అశోక్ నగర్ పంప్ హౌస్ ఎదురుగా ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నివసిస్తున్న మీసాల మారెమ్మ అనే అనాధ వృద్ధురాలు మృతి చెందారు. గత మూడు సంవత్సరాలుగా వసతి గృహంలో ఉంటున్న ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అనారోగ్యంతో మరణించిన ఆమెకు ఎవరూ లేకపోవడంతో, రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల మానవతా దృక్పథంతో స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించారు.