కర్నూలు: పోలీసులకు ఉపయోగకరమైన డైరీ ఆవిష్కరణ

390చూసినవారు
కర్నూలు: పోలీసులకు ఉపయోగకరమైన డైరీ ఆవిష్కరణ
శుక్రవారం కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రూపొందించిన పోలీసు డైరీ – 2026 ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. ఈ డైరీలో పోలీసులకు అవసరమైన కీలక సమాచారం సేకరించబడిందని, విధుల్లో ఉన్న సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగకరమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, జిల్లా పోలీసు అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్