కర్నూలు: ఓటరు వద్దే డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: ఈఆర్వో

885చూసినవారు
కర్నూలు: ఓటరు వద్దే డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: ఈఆర్వో
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లినప్పుడే ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కర్నూలు ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఓటర్లు తమ ఫోటోలు, ఆధార్, ఓటరు కార్డు తదితర పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఓట్ల తొలగింపుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఎస్‌ఐఆర్ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలని, బీఎల్‌వోలతో పాటు బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో పాల్గొనాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్