కర్నూలు: జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అధికారుల సహకారం అవసరం

546చూసినవారు
కర్నూలు: జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అధికారుల సహకారం అవసరం
కర్నూలు జిల్లా ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పనకు సంబంధిత శాఖల అధికారులు సమగ్ర సమాచారం అందించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు ఇచ్చారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి మాస్టర్ ప్లాన్ కీలకమని, ఇందుకోసం పారిశ్రామిక వాడల లేఅవుట్లు, ఇండస్ట్రియల్ జోన్ వివరాలు, క్లస్టర్ల సరిహద్దులు, సెమీకండక్టర్, డ్రోన్ వంటి ఆధునిక పరిశ్రమల స్థాపనకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్