కర్నూలు జిల్లాలో ఈనెల 15న జరగనున్న కూటమి మహాసభను విజయవంతం చేసేందుకు
బీజేపీ,
టీడీపీ,
జనసేన జిల్లా అధ్యక్షులు సమన్వయ సమావేశం నిర్వహించారు. శనివారం కర్నూలు
టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణ పరమహంస,
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,
జనసేన జిల్లా అధ్యక్షుడు చిత్తా సురేష్ పాల్గొన్నారు. సుమారు 5,000 మంది కార్యకర్తలతో జరగనున్న మహాసభ ఏర్పాట్లు, కార్యాచరణ, సమన్వయంపై చర్చించారు. కూటమి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.