మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం కర్నూలు మండల కమిటీ డిమాండ్ చేసింది. గురువారం కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో అధికారి కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ చట్టం గ్రామీణ పేదలకు జీవనాధారమని, ఆంధ్రప్రదేశ్‌లో 71 లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారని సీపీఎం నాయకులు తెలిపారు. చట్టాన్ని విబిజి రాంజీ స్కీమ్‌గా మార్చే ప్రయత్నాలు విరమించాలని, 200 పని దినాలు కల్పించి కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.