కర్నూలు: ప్రవేశ ద్వారాలు పరిశుభ్రంగా ఉండాలి: కమిషనర్ చల్లా

1334చూసినవారు
కర్నూలు: ప్రవేశ ద్వారాలు పరిశుభ్రంగా ఉండాలి: కమిషనర్ చల్లా
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మంగళవారం నగరంలోకి ప్రవేశించే ద్వారాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్-44 సర్వీస్ రోడ్లలోని న్యూ కృష్ణనగర్, రామచంద్రనగర్, గుత్తి పెట్రోల్ బంక్, షరీన్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. చెత్త, మురుగు నిల్వలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కలుపు మొక్కలను తొలగించాలని సూచించారు. ప్రవేశ ద్వారాల నిర్వహణకు ప్రత్యేక వాహనం, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద అన్న క్యాంటీన్‌ను కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్