ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఓటరు భాగస్వామి కావాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేసి సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.