కర్నూలు నగరంలోని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బుధవారం ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 53 వాహనాల వేలం జరిగింది. సుమారు 50 మంది పోటీదారులు పాల్గొన్న ఈ వేలంలో, రూ. 6.73 లక్షల అంచనా విలువ గల వాహనాలు రూ. 8.75 లక్షలకు అమ్ముడయ్యాయి. జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 10.32 లక్షల ఆదాయం వచ్చిందని, ఇది అంచనా విలువ కంటే సుమారు 30 శాతం అధికమని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తెలిపారు.