ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బెస్త రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డీఎస్సీ నియామకాల ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలను పూర్తిగా నిరాధారమని విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, ధ్రువపత్రాల పరిశీలన వంటి అంశాలను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా అమలు చేస్తున్నప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఉద్యోగ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.