కర్నూలు అసెంబ్లీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అపోహలు వీడి సహకరించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించబడదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పలు పోలింగ్ బూత్‌లలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, అవసరమైన ధ్రువపత్రాలతో వివరాలు సమర్పించాలని సూచించారు. ఓటర్ల గుర్తింపు, ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.