కర్నూలు: నాగేశ్వరరావు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

343చూసినవారు
సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి జె. నాగేశ్వరరావు మృతి ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం. ఏ. గఫూర్ అన్నారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో నిర్వహించిన నాగేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగేశ్వరరావు అంకితభావంతో, క్రమశిక్షణతో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. సభలో సిఐటియు, సిపిఎం నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించారు.

సంబంధిత పోస్ట్