కర్నూలు: నీట్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

584చూసినవారు
కర్నూలు: నీట్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్
ఈనెల 21న జరగనున్న నీట్ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 16 కేంద్రాల్లో 4,928 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు మధ్యాహ్నం 1:30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని, వారి కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్