కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం రావాలంటే ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. రీ సర్వే, ఎఫ్-లైన్, ఐవిఆర్ఎస్ కాల్స్, ప్రజల సానుకూల దృక్పథం వంటి రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్, ఎఫ్-లైన్‌లో ఉన్న అన్ని అర్జీలను వేగంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. సర్వేకు రైతుల నుంచి డబ్బులు వసూలు చేయరాదని హెచ్చరించారు.