కర్నూలు: ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో నగరంలో స్వచ్ఛతకు ఊతం

217చూసినవారు
కర్నూలు: ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో నగరంలో స్వచ్ఛతకు ఊతం
కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ నాలుగో వారపు కార్యక్రమాలను శనివారం కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి ప్రారంభించారు. ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, ముజఫర్ నగర్‌లో గార్బేజ్ పాయింట్‌ను నర్సరీగా అభివృద్ధి చేసిన ప్రాంతాలను పరిశీలించారు. తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా అందించడం, చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించడం ద్వారా స్వచ్ఛ నగర నిర్మాణానికి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్