కర్నూలు: పీ4 పథకం.. నగదు కాదూ, భావి తరాల అభివృద్ధి

674చూసినవారు
కర్నూలు: పీ4 పథకం.. నగదు కాదూ, భావి తరాల అభివృద్ధి
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, బంగారు కుటుంబాల అభివృద్ధి అంటే కేవలం నగదు బదిలీ కాదని, వారి పిల్లల ఉన్నత భవిష్యత్తు, ఆలోచనా విధానం, జీవనశైలిని మెరుగుపరచడమే పీ4 కాన్సెప్ట్ అసలు ఉద్దేశ్యమని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పి4 వార్షికోత్సవ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా జిల్లా పరిధిలో దాదాపు 59,000 బంగారు కుటుంబాలను, కర్నూలు నియోజకవర్గంలో 2,137 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, బంగారు వ్యాపారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్