కర్నూలు: బంగారు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

658చూసినవారు
కర్నూలు: బంగారు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని ఎస్పీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్