కర్నూలు: అంబటి అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం ఇస్తారు

767చూసినవారు
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ, వ్యక్తిగత దూషణలు వైసీపీ నాయకుల దిగజారిన రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడలేని వారు చౌకబారు విమర్శలకు దిగడం దురదృష్టకరమని, అసభ్య రాజకీయాలు మానుకుని సానుకూల చర్చకు రావాలని, లేదంటే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్