కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 0 నుంచి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. జిల్లాలో 1,630 పోలియో బూత్‌లు, 52 ట్రాన్సిట్ కేంద్రాలు, 33 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం చుక్కలు వేయించుకోని వారికి జూన్ 29, 30 తేదీల్లో వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తాయని వెల్లడించారు.