2026-27 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాలోని 52 ప్రభుత్వ శాఖలకు రూ. 2,833 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి రూ. 349 కోట్లు, వైద్య విద్యకు రూ. 333 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 260 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ. 204 కోట్లు, ప్రజా రవాణాకు రూ. 187 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, స్కూల్ ల్యాబ్స్, టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించామని, రాబోయే కాలంలో 38 కొత్త ప్రాజెక్టుల ద్వారా రూ. 98,979 కోట్ల పెట్టుబడితో సుమారు 28,903 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని కలెక్టర్ తెలిపారు.