కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: కమిషనర్

1411చూసినవారు
కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: కమిషనర్
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, నగరపాలక సేవలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. సోమవారం ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 అర్జీలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, నగరపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్