కర్నూలు: రాష్ట్ర చరిత్రలోనే వేరుశనగ రికార్డు ధర.. రూ. 15, 001

304చూసినవారు
కర్నూలు: రాష్ట్ర చరిత్రలోనే వేరుశనగ రికార్డు ధర.. రూ. 15, 001
గురువారం కర్నూలు మార్కెట్ యార్డులో చరిత్రలోనే అత్యధికంగా రైతులు తెచ్చిన వేరుశనగ కాయలకు క్వింటాకు రూ. 15,001 ధర లభించింది. మొత్తం 319 క్వింటాళ్ల వేరుశనగ కాయలకు ఈ ధర నమోదు కాగా, మధ్యస్థ ధర రూ. 11,589గా ఉందని మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. క్రిష్ణగరి మండలం కర్లకుంటకు చెందిన రైతులు ఈ అత్యధిక ధర పొందారు. గత నెలతో పోలిస్తే ధరలు రెట్టింపు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్