కర్నూలు: రోడ్డుప్రమాదంలో బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి మృతి

కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌గేట్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి డి. పీ. స్వామన్న (74) మృతి చెందారు. మిడుతూరు మండలం మాసాపేట గ్రామానికి చెందిన స్వామన్న మోకాళ్ల నొప్పులతో చికిత్స కోసం కర్నూలుకు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌గేట్ నుంచి బుధవారపేట జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలైన స్వామన్నను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
