ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణం నుండి రాజ్ విహార్ వరకు నిర్వహించిన వాక్‌థాన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా పోలీసు అధికారి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలకై అతివేగం, మద్యం సేవ, హెల్మెట్, సీట్‌బెల్ట్ లేని అలవాట్లే ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు.