కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి విజయలక్ష్మినగర్‌లో గురువారం పట్టపగలే దొంగలు మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగలను అపహరించారు. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని తోసివేసి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.