కర్నూలు: ఉద్యోగం పేరుతో రూ. 11 లక్షల మోసం: బాధితుడి ఫిర్యాదు

407చూసినవారు
కర్నూలు: ఉద్యోగం పేరుతో రూ. 11 లక్షల మోసం: బాధితుడి ఫిర్యాదు
కర్నూలులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 11.13 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం వెంకటరమణ కాలనీకి చెందిన లోకేష్, హైదరాబాద్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న ఈదర వెంకట రమేష్‌పై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. రమేష్ పలు టీవీ చానళ్లలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నారని, అయితే ఉద్యోగం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్