కర్నూలు: ఎస్సీ బ్యాక్‌లాగ్ ఉద్యోగం పేరుతో రూ. 3 లక్షల మోసం

406చూసినవారు
కర్నూలు: ఎస్సీ బ్యాక్‌లాగ్ ఉద్యోగం పేరుతో రూ. 3 లక్షల మోసం
ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశాడని, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు గౌలీగేరి ప్రాంతానికి చెందిన అర్జున్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎస్పీని కలిసి తన సమస్యను వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి అటెండర్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఉద్యోగం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్