ఒకప్పటి రాష్ట్ర రాజధాని కర్నూలు జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని డాక్టర్ తిరుపాల్ రెడ్డి శనివారం కర్నూలులో ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి తరహాలో కర్నూలును నాలుగో ప్రధాన నగరంగా తీర్చిదిద్దాలని, ఐటీ రంగాన్ని విస్తరించి యువతకు ఉపాధి కల్పించాలని, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాలేదని ఆయన పేర్కొన్నారు.