కర్నూలు రైల్వే శాఖకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, 2026-27 బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ కేంద్ర రైల్వే శాఖను డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్యప్రకాష్‌కు సీపీఎం, సీపీఐ, అవాజ్ కమిటీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. అమరావతికి ఒక్క రైలు కూడా కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు, రాజశేఖర్, జబ్బర్‌మౌలాన పాల్గొన్నారు.