కర్నూలు: గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి: కమిషనర్

1488చూసినవారు
కర్నూలు: గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి: కమిషనర్
కర్నూలు అసెంబ్లీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జూలై 14లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం 123వ సచివాలయంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరించాలని, ఓటర్లు అవసరమైన గుర్తింపు పత్రాలు, ఫొటోలు సిద్ధంగా ఉంచుకోవాలని, 2002 నాటి ఓటరు నమోదు వివరాలు, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మల ఓటరు నమోదు వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్