స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. మంగళవారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏఈఆర్వోలు, అదనపు ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం 177వ పోలింగ్ బూత్ పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఎస్‌ఐఆర్‌లో అత్యల్ప శాతం ఉన్న బిఎల్వోలకు ఈఆర్వో నేరుగా కాల్ చేసి, వాటికి కారణాలు తెలుసుకుని మరింత వేగవంతం చేయాలని సూచించారు.