కర్నూలు జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి పి. విజయ ప్రత్యేక కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల్య వివాహ ముక్త భారత్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా, ఖాజీలకు శనివారం వన్ టౌన్ లోని మస్జీద్ లో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, 18 ఏళ్లు నిండని అమ్మాయిల వివాహాలకు తల్లిదండ్రులు, ఖాజీ, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, అతిథులు కూడా శిక్షకు అర్హులేనని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం నవంబర్ 27 నుండి మార్చి 8వ తేదీ వరకు జరుగుతున్న ప్రణాళికలో భాగం.