కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం వీకర్ సెక్షన్ కాలనీ-2లో అబేట్ ద్రావణం పిచికారీ, బుధవారపేటలో శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. నగరవ్యాప్తంగా 39 మంది ప్రత్యేక సిబ్బంది, 10 యంత్రాలతో స్ప్రేయింగ్, ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు, ప్రతి పది రోజులకు అబేట్ పిచికారీ, రెండు వారాలకు ఒకసారి ఫాగింగ్ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.