డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఐజీ ఆకే రవికృష్ణ

1518చూసినవారు
కర్నూలు నగరంలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా విద్యార్ధులు, ప్రజలకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే రాష్ట్ర లక్ష్యం అని, సమిష్టి కృషితో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, విద్యార్ధులకు ఎప్పుడూ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్