కర్నూలు: రాబోయే రోజుల్లో కూడా సర్వేయర్లకు సహాయం అందించాలి

612చూసినవారు
కర్నూలు: రాబోయే రోజుల్లో కూడా సర్వేయర్లకు సహాయం అందించాలి
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కర్నూలులో జేసీకి వినతిపత్రం అందజేస్తూ, గత 7 సంవత్సరాలుగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమకు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు గుర్తించి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీవో ఆర్టీ నెంబర్ 446ను విడుదల చేశారని తెలిపారు. ఈ జీవో ద్వారా ఉపాధి కల్పించినందుకు సర్వేయర్లు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయం అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్