కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజి భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అంతకుముందు, నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి భరత్, ఎంపీ నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.