రాష్ట్ర ప్రభుత్వంపై ఫ్యాప్టో (FAPTO) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. గురువారం కర్నూలులోని ఎ. క్యాంప్ మాంటిస్సోరి స్కూల్‌లో ఉన్న మూల్యాంకన కేంద్రంలో వందలాది ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ ఎం. మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ జనరల్ జి. భాస్కర్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో, ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లకు మద్దతుగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.