కర్నూలు: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం పాలన

465చూసినవారు
కర్నూలు: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం పాలన
కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి పాలన అందిస్తోందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో 2026-27 బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల లక్ష్యం ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్