రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేయడమేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ. జీ. భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులో 2.50 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఒక భావోద్వేగ అంశమని, దీనికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులకు రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతోందని, అర్హులు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పురసేవ యాప్‌ను వినియోగించుకోవాలని కూడా ఆయన సూచించారు.