కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు, వ్యాపార, అపార్ట్మెంట్స్ అసోసియేషన్, మైనార్టీ నాయకులు ఏటా ఇంటి పన్నులు పెంచడాన్ని వ్యతిరేకించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన విధానాన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తుండటంపై పుల్లయ్య, సీనియర్ న్యాయవాది నాగేంద్రనాథ్, సురేష్ రెడ్డి, బాలరాజు తదితరులు విమర్శించారు. ఏటా 15% ఇంటి పన్నులు పెంచే విధానాన్ని నిలుపుకోవాలని వారు డిమాండ్ చేశారు.