నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు జిల్లా పోలీసులు రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.