కర్నూలు: యోగాంధ్రలో భాగంగా పర్యాటక యోగ కార్యక్రమం

326చూసినవారు
కర్నూలు: యోగాంధ్రలో భాగంగా పర్యాటక యోగ కార్యక్రమం
కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని, శారీరక-మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. శనివారం కర్నూలు ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పర్యాటక యోగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యోగా ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో యోగాంధ్రపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జూన్ 21న జరిగే మెగా యోగా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సందీప్ కుమార్, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్