ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మంగళవారం ప్యానెల్ న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. ఉచిత న్యాయసహాయం అర్హులకు చేరేలా కృషి చేయాలని, ప్రజలకు న్యాయ చైతన్యం కల్పించి, న్యాయ సేవా సంస్థలకు వారధిగా పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారాలపై అవగాహన కల్పించాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు కోరారు. ఈ శిక్షణలో ప్యానెల్ న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.