పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ఆదివారం కర్నూలు కొత్తపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్‌ను సందర్శించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. నగరంలో 82,964 మంది చిన్నారుల కోసం 229 పోలియో బూత్‌లు, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చుక్కలు వేయించుకోని చిన్నారులకు ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తాయని వెల్లడించారు.