ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేయాలని కౌన్సిల్ ఆఫ్ సివిల్ రైట్స్ అండ్ విజిలెన్స్ సంస్థ నిర్ణయించింది. శనివారం కర్నూలులో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆసుపత్రుల దోపిడీ, అవినీతి, విద్యాసంస్థల్లో అక్రమ రుసుములు, మహిళలపై దాడులు, రైతు, భూ సమస్యలు వంటి అంశాలపై పోరాడాలని తీర్మానించారు. బాధితులకు చట్టపరంగా అండగా ఉంటామని, అవగాహన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు చేపడతామని సంస్థ తెలిపింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు దండు విద్యాసాగర్, కార్యదర్శి వై. కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.