కర్నూలు: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

1233చూసినవారు
కర్నూలు: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, నిర్దేశిత గడువులోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో, బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్