కర్నూలు: కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు సిద్దమా బహిరంగ సవాల్

838చూసినవారు
కర్నూలు: కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు సిద్దమా బహిరంగ సవాల్
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం కర్నూలులో మాట్లాడుతూ, రాయలసీమకు ఎక్కువ అన్యాయం జగన్ పాలనలోనే జరిగిందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రజా ధనం లూటీ చేశారని, వైసీపీ చేసిన ద్రోహంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ రాయలసీమకు ఏమి మేలు చేశాయో కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు వైసీపీ నాయకులు సిద్ధమా అని బహిరంగ సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్